కల్వకుర్తిలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమం
NGKL: కల్వకుర్తి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 'నషా ముక్త భారత్ అభియాన్' కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆబ్కారీ శాఖ సీఐ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ.. భారతదేశంలో పెరుగుతున్న మత్తు పదార్థాలకు విద్యార్థులు బానిసలవుతున్నారని తెలిపారు. యువత, డ్రగ్స్‌కు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.