కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రేకుల చౌడాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలం అయిందన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని వెల్లడించారు.