'గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం ఇస్తాం'

కడప: గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని ఆదివారం మాజీమంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. కొండాపురంలో మూడు పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. హంతకులకు సీట్లు ఎలా ఇచ్చారని సొంత సోదరీమణులు జగన్‌ను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.