'కేసు ఛేదించిన పోలీసులకు అభినందన'

'కేసు ఛేదించిన పోలీసులకు అభినందన'

WGL: చెన్నారావుపేట మండలం టీకేతండా శివారు ఇందియా తండాలో బోడ బుజ్జి అనే మహిళ ఇంట్లో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 20తులాల వెండి ఆభరణాలు, అర తులం బంగారు కమ్మలు, రూ.70వేల నగదు దొంగిలించారని గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్నారు. వారిని శనివారం అధికారులు అభినందించారు.