పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి: ఎమ్మెల్యే
PLD: వినుకొండ మండలంలోని ఏ.కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయం అత్యంత కీలకమని సూచించారు.