'పశుసంపద అభివృద్ధికి రైతులకు సహకారం అందించాలి'
ASF: తిర్యాణి మండలంలో మంగళవారం కలెక్టర్ హరిత, నీతి ఆయోగ్ ప్రత్యేక అధికారి శర్మతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సంపూర్ణత అభ్యాన్ 2.0లో భాగంగా నిర్వహిస్తున్న పశువులకు గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. పశుసంపద అభివృద్ధికి అధికారులు రైతులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీడీ రమాదేవి పాల్గొన్నారు.