చందారంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు

చందారంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు

MNCL: లక్షెట్టిపేట మండలంలోని చందారంలో తీజ్ ఉత్సవాలను బంజారా కులస్తులు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలో బంజారా కులస్తులు తీజ్ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం గ్రామంలోని మహిళలు తీజ్ ఉత్సవాలను నిర్వహించి సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు పింగలి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు, బంజారా నాయకులు ఉత్తమ్ ఉన్నారు.