శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఓపెన్

NDL: శ్రీశైలం ఆనకట్ట 10 గేట్లను బుధవారం మధ్యాహ్నం జలవనరుల శాఖాధికారులు ఎత్తారు. 6 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదలచేశారు. రిజర్వాయర్ జలకళను సంతరించుకుని పూర్తిస్థాయిలో నిండింది. దీంతో పాటు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఉదయం 2 గేట్లు, మధ్యాహ్నం మరో 2 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం 10గేట్ల ద్వారా 2,71,570 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.