19, 20 తేదీల్లో పీఎస్సీ ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సు

19, 20 తేదీల్లో పీఎస్సీ ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సు

TG: దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సు ఈనెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సదస్సును రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించనున్నట్లు TGPSC ఛైర్మన్ వెంకటేశం వెల్లడించారు. తొలిరోజు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరు కానున్నట్లు తెలిపారు.