గంజాయి అమ్మకాలు..ఇద్దరు స్నేహితుల అరెస్టు

NLR: ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తరలించి నెల్లూరులో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ప్రవీణ్, రవి అనే ఇద్దరు స్నేహితులను దర్గామిట్ట పోలీసులు పక్క సమాచారంతో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసమే ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై నిఘా ఉంచి పట్టుకున్నట్లు వెల్లడించారు.