ఆర్థిక వృద్ధికి విధ్యే ఆధారం: న్యాయమూర్తి వాసంతి
W.G: ప్రతి ఒక్కరూ ఆర్థికంగా వృద్ధి చెందాలంటే తప్పనిసరిగా విద్యావంతులు కావాలని 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ. వాసంతి పిలుపు నిచ్చారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా నరసాపురం 29వ వార్డులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలను వ్యతిరేకించాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈ మేరకు జడ్జి సూచించారు.