కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఫైర్
W.G: భీమవరంలో పర్యటించిన మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలను, లడ్డూ ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. శాసనమండలి ఛైర్మన్ కులం, జాతి గురించి ప్రస్తావించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆరోపించారు. దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.