VIDEO: కిన్నెరసాని జలాశయానికి వరద.. ఒక గేటు ఎత్తివేత

BDK: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. రిజర్వాయర్‌లోకి 1400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, శనివారం ఉదయం నాటికి నీటిమట్టం 405.40 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఒక గేటును తెరిచి 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు.