రేపటి నుంచి జిల్లాలో నూతన నిబంధనలు: డీఎస్పీ

ADB: పట్టణంలో రేపటి నుంచి నూతన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ శాఖ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లయితే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయబడతాయని ఆయన హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై 1 సంవత్సరం జైలు, 5,000 వేల వరకు జరిమానా శిక్షగా ఉంటుందన్నారు.