మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

సూర్యాపేట: వేములపల్లి మండలం ఆమనగల్లుకి చెందిన దుగ్గి ధనమ్మ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. సోమవారం మాజీ దేవాలయ ఛైర్మన్, కాంగ్రెస్ నాయకులు వెలగపల్లి వెంకటేష్ ఆమె దశదినకర్మలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.