పోలీసుల తనిఖీల్లో 20 కేజీల గంజాయి స్వాధీనం
VSP: పెందుర్తి రైల్వే స్టేషన్ పరిసరాల్లో సెక్యూరిటీ వింగ్ పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో సుమారు 20 కేజీల గంజాయిని గుర్తించి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పెందుర్తి పోలీసులకు అప్పగించారు. గంజాయిని గుర్తించిన డాగ్‌ను, హ్యాండ్లర్‌ను సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.