స్టడీ అవర్స్‌ను పరిశీలించిన ఎంఈఓ మాధవరావు
శ్రీకాకుళం: పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న వేళ విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకోవాలని ఎంఈఓ బమ్మిడి మాధవరావు సూచించారు. సోమవారం జలుమూరు మండలం లింగాలపాడు జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్‌ను ఆయన పరిశీలించారు. బట్టి పెట్టే విధానాన్ని వీడనాడాలని, పాఠాలను అర్థం చేసుకొని మననం చేసుకోవాలని అప్పుడే పరీక్షలు బాగా వ్రాయగలుగుతారని అన్నారు.