ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో వ్యాను, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌‌కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.