టాప్‌లో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద 2025 ఫిడే సర్క్యూట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 2026 క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. ఇటీవల సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో పెద్దగా రాణించలేపోయిన అతడు.. తాజాగా లండన్ చెస్ క్లాసిక్ 2025లో ఉమ్మడి విజేతగా నిలిచాడు. దీంతో ప్రతిష్ఠాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నీకి క్వాలిఫై అయ్యాడు.