నరసన్నపేటలో పందుల జోరు.. ప్రజలు బేజారు

SKLM: నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో రోజురోజుకు పందుల జోరుతో ప్రజలు బేజారు పడుతున్నారు. వీధుల్లో విచ్చలవిడిగా పందులు తిరుగుతూ అనేక రోగాలకి గురి చేస్తున్నాయని, అనేకసార్లు మారుతీ నగర్ ప్రజలు పంచాయతీ కార్యాలయానికి తెలియజేసినా కనీసం చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్లో వాటిని అరికట్టకపోతే అనేక రోగాలు వస్తాయని ప్రజలు భయపడుతున్నారు.