ఉపాధి నిధులతో సీసీ రోడ్లు నిర్మాణానికి శ్రీకారం
ELR: గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వరం లాంటిదని సర్పంచ్ దిడ్ల అలకనంద అన్నారు. శనివారం ఉంగుటూరు(M) నారాయణపురంలో ఉపాధి హామీ నిధులు రూ.40 లక్షలతో గీతాంజలి స్కూల్ నుంచి పాతూరు సత్యనారాయణ పొలం, టైల్ ఫ్యాక్టరీ రోడ్డు వరకు సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ధర్మరాజు కృషితో ఈ పనులు చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.