పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ప్రకాశం: మార్టూరు మండలం ఇసుకదర్శి పాండురంగ స్వామి ఆలయం వద్ద శనివారం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ రమీజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు