ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఎయిరిండియా
ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన సర్‌ఛార్జిలను పెంచింది. ప్రస్తుతం రూ.299 ఉన్న ఫీజును రూ.899కి పెంచినట్లు తెలిపింది. డొమెస్టిక్ విమానాలకు రేపటి నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. అంతర్జాతీయ విమానాలకు ఏప్రిల్ 10 నుంచి ఈ పెంపు వర్తించనుంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఏటీఎఫ్ ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.