పులిపాటి వెంకటేశ్వర్లు మన తెనాలి వారే
GNTR: తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు తెనాలిలో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచుకున్న ఆయన తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి తదితర పాత్రలను పోషించడమే కాక, 1932లో సినిమా రంగంలో ప్రవేశించి 12 సినిమాలలో నటించారు.