954 కబ్జాలను తొలగించాం: కమిషనర్
HYD: నగర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మెరుగైన జీవనాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు హైడ్రా పని చేస్తుందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా ద్వారా ఇప్పటివరకు 1,045.12 ఎకరాల భూమిని రక్షించిందని, సుమారు 181 స్పెషల్ డ్రైవ్‌లలో 954 కబ్జాలను తొలగించామని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ. 55 వేల కోట్లు ఉంటుందన్నారు.