చిత్తూరులో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవం

CTR: PVKN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ జానపద దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సహదేవ నాయుడు గ్రామీణ జానపద కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, జానపద కళాకారుల జీవనశైలి, సనాతన ఆచార వ్యవహారాలు, అక్షర జ్ఞానం, పాటల పరిజ్ఞానం, జీవన సౌందర్యంపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు.