కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి: జీవన్ రెడ్డి
TG: త్వరలోనే జగిత్యాలలో సభ పెట్టి BRSలో చేరతానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పారు. KCRతో దాదాపు 5 గంటల పాటు సమావేశమైన జీవన్ రెడ్డి.. తన విషయంలో PCC తప్పు చేసి ఆ నింద AICCపై వేస్తోందని మండిపడ్డారు. తనకు 14 సార్లు బీ ఫామ్ ఇచ్చారంటే అది తన సమర్థతతోనే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో పయనిస్తోందన్నారు. కాంగ్రెస్ పోవాలి.. KCR రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైందన్నారు.