తొలిరోజు 17 కేసులు విచారించిన కొత్త సీజేఐ

తొలిరోజు 17 కేసులు విచారించిన కొత్త సీజేఐ

సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తొలి రోజు 17 కేసులు విచారించారు. అలాగే, ఓ కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకొచ్చారు. ఇకపై అర్జెంట్‌ లిస్టింగ్‌ కేసులను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లోనే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నట్లు చెప్పారు.