కాంట్రాక్టు బోధనా సిబ్బంది కొనసాగింపు

కాంట్రాక్టు బోధనా సిబ్బంది కొనసాగింపు

AP: శ్రీవేంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ పరిధిలో ఖాళీగా ఉన్న 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో కాంట్రాక్టు బోధనా సిబ్బందిని కొనసాగించనున్నారు. ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేంత వరకూ లేదా ఏడాది పాటు వీరిని కొనసాగించాలని పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి నెలకు రూ.57,700 వేతనంగా చెల్లించేందుకు అనుమతించారు.