VIDEO: అటవీ శాఖ కలప డిపోలో అగ్ని ప్రమాదం

MLG: ఏటూరునాగారం అటవీశాఖ కలపడిపోలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా ఎగసి పడుతున్న మంటల్లో విలువైన కలప కాలిపోతుంది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపులోకి వచ్చాయి. సమీపంలోని అడవిలో ఎరగడి మంటలు వ్యాపించడం వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. విలువైన కలప దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.