చెస్‌లో అంతర్జాతీయ రేటింగ్ సాధించిన గుంతకల్లు విద్యార్థి
ATP: చదరంగంలో గుంతకల్లు విద్యార్థి సాయి సౌరిష్ అంతర్జాతీయ రేటింగ్ సాధించాడు. వంకదారు వీరేంద్ర-సౌమ్య దంపతుల కుమారుడు సౌరిష్ రోటరీ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. కర్నూలులో గత నెలలో జరిగిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొని రాపిడ్ రేటింగ్ 1,440, బ్లిట్జ్ రేటింగ్ 1,651 సాధించి రికార్డు సృష్టించాడు.