టాస్క్‌ఫోర్స్ దాడులు.. కాలం చెల్లిన ఫుడ్ సీజ్

టాస్క్‌ఫోర్స్ దాడులు.. కాలం చెల్లిన ఫుడ్ సీజ్

RR: మైలార్‌దేవ్‌‌పల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో స్టార్ ట్రేడింగ్ కంపెనీ హోల్ సేల్ షాపులో తనిఖీలు నిర్వహించారు. కాలం ముగిసిన బిస్కెట్లు, మిక్చర్ ప్యాకెట్లు, తయారీ తేదీ, లేబుల్స్ లేని నాసిరకం తినుబండారాలను గుర్తించారు. భారీ మొత్తంలో నిల్వలు స్వాధీనం చేసుకుని, కంపెనీ నిర్వాహకులపై పలు సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు.