పోలమాంబ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
VSP: 14 గ్రామాల గ్రామదేవతగా విరాజిల్లుతున్న పెదవాల్తేరు కరక చెట్టు పోలమాంబ దేవస్థానం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 2-3 గంటల సమయం పడుతోందని ఈవో రాజగోపాల్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.