VIDEO: మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన భర్త

VIDEO: మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన భర్త

MHBD: భార్యపై భర్త దాడిచేసి ఆమెను తీవ్రంగా గాయపరిచిన ఘటన కొత్తగూడ మండలంలో అర్థరాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శివరాత్రి శైలజ (45)కు భర్తతో గొడవలు జరుగుతున్నాయి. భర్త రాత్రి మద్యం సేవించి రాగా ఇద్దరు మధ్య మళ్లీ గొడవైంది. దీంతో ఆగ్రహించిన భర్త అర్ధరాత్రి కర్రతో ఆమె తలపై కొట్టగా గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.