ఇందిరమ్మ కాలనీలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం
SS: ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి నుంచి 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను మంత్రి త్రివేణి ప్రారంభించారు. కాలనీవాసుల ఆరోగ్యమే ప్రాధాన్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. స్వచ్ఛమైన నీటితో రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆమె తెలిపారు.