వైరా 2వ వార్డులో బీఆర్ఎస్ విజయం..!

వైరా 2వ వార్డులో బీఆర్ఎస్ విజయం..!

KMM: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా వైరా 2వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జయభేరి మోగించింది. ఈ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని తిరుపతి శివకుమారి తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన బత్తుల గీతపై ఆమె పైచేయి సాధించి వార్డును కైవసం చేసుకున్నారు.