శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటి వివరాలు

NRML: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటి వివరాలను అధికారులు మంగళవారం వెల్లడించారు. నీటి మట్టం 1089 అడుగుల వద్ద ఉండగా, 73.37 టీఎంసీల నీరు నిల్వలో ఉంది. ప్రాజెక్టుకు 1,45,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, 2,00,445 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 38 స్పిల్‌వే గేట్ల ద్వారా 1,73,578 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.