అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సమీక్ష
NTR: విజయవాడలోని కలెక్టరేట్లో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌తో కలిసి ఎస్సీలపై జరిగే అఘాయిత్యాల కేసుల పరిష్కారంపై కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ అఘాయిత్యాల కేసులను వేగంగా పరిష్కరించేందుకు సమర్థవంతమైన పర్యవేక్షణ అత్యవసరమని తెలిపారు. కేసులపై నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు.