'ఆన్‌లైన్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి'
SRD: బొల్లారంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎస్సై కిష్టారెడ్డి, సైబర్ క్రైమ్ సిబ్బంది కార్మికులకు హాలీడే ప్యాకేజీలు,ఫేక్ కస్టమర్ సర్వీస్, సెల్ టవర్ ఏర్పాటు, హోటల్ బుకింగ్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, ఓటీపీలు పంచుకోవద్దని హెచ్చరించారు.