యాదగిరీశునికి రికార్డు స్థాయి ఆదాయం..!
BHNG: యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నేడు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రూ.1.57 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. స్వామివారి దర్శనార్థం 60 వేల మంది భక్తులు వచ్చినట్టు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో, ఆలయ ఆదాయం పెరిగినట్లు తెలిపారు. దీంతో ఏర్పాట్లను కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, నిన్న 53 లక్షల ఆదాయం వచ్చింది.