విశాఖకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్

VSP: రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం నగరానికి రానున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఆయన హైదరాబాదు నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బస చేయనున్నారు. శుక్రవారం పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్‌లో జరగనున్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.