VIDEO: కనిగిరిలో రైల్ ఇంజన్‌తో ట్రయిల్ రన్ పూర్తి..

ప్రకాశం: కనిగిరిలో నడికుడి -- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మండలంలోని ఎడవల్లి వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా ట్రాక్ పై ఆదివారం అధికారులు రైల్ ఇంజన్‌తో విజయవంతంగా ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు. రెండోసారి ట్రాక్‌పై ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తిచేశారు. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ఉగ్ర పర్యవేక్షణతో పనులు చకచక సాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.