బాబా ఖాదర్ మసీదును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
VZM: విజయనగరంలోని బాబా ఖాదర్ మసీదును శుక్రవారం గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య సందర్శించారు. బాబా మెట్టలోని హజరత్ సయ్యద్ షాహిన్ షా బాబా ఖాదర్ వలి 67వ సుగంధ మహోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సంతోషంగా ఉండాలని, ఏ సమస్యలు రావద్దని కోరుకున్నట్లు తెలిపారు.