చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి
VZM: ఎస్.కోట పట్టణంలోని కోటాను వీధి చెందిన ఎన్.చంద్రరావు ఈనెల 19న ఇంటి దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆనంతరం విశాఖ ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. బార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.