ప్రారంభమైన జలజీవన్ మిషన్ పనులు

ప్రారంభమైన జలజీవన్ మిషన్ పనులు

SKLM: బూర్జ మండలం తోటవాడ గ్రామ పంచాయతీలో జల జీవన మిషన్ పనులు మంగళవారం ప్రారంభం అయ్యాయని స్థానిక సర్పంచ్ సూర ఆనందరావు తెలిపారు. పైప్ లైనింగ్ పనులు, కాంక్రీట్ పనులు తదితర వాటికి సుమారు 80 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. కుళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా చేసేందుకు క్షేత్రస్థాయిలో తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.