కోర్టును తనిఖీ చేసిన ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ASR: అరకులోయ కోర్టును శనివారం ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు కోర్టు రికార్డులను పరిశీలించారు. పాత కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రికార్డుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంట అరకులోయ కోర్టు ఇంఛార్జ్ జడ్జ్ రాము, సీఐ హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, న్యాయవాదులు ఉన్నారు.