రేపు మంచిప్పలో U/17 రెజ్లింగ్ ఎంపికలు
NZB: మోపాల్ మండలం మంచిప్ప జడ్పీ హైస్కూల్లో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు అండర్-17 మహిళా, పురుషుల రెజ్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల క్రీడాకారులు దీనికి అర్హులు. ఆసక్తి గల వారు ఒరిజినల్ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు.