అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శంకుస్థాపన

కోనసీమ: రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ఆదివారం సుమారు రూ. 40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ప్రజల ఇబ్బందులను తొలగిస్తామన్నారు.