రేపు తానూర్‌లో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
NRML: జిల్లా తానూర్ మండల కేంద్రంలో జాతర సందర్భంగా బుధవారం అంతర్రాష్ట్ర మల్లయోధులకు కుస్తీ పోటీలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. గ్రామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు మొదలవుతాయన్నారు. ఈ మేరకు ప్రథమ బహుమతిగా రూ.11,111 నగదు, వెండి కడియం,అందించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వహకులు పేర్కొన్నారు.