'ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే సమస్యలు పేరుకుపోయాయి'

'ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే సమస్యలు పేరుకుపోయాయి'

JNG: ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే పట్టణాల్లో సమస్యలు పేరుకుపోయాయని CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ. అబ్బాస్ అన్నారు. జనగామ పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. అబ్బాస్ మాట్లాడుతూ.. పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు.